బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్, ఆయన తనయుడు

నఖిలీ పత్రాల కేసుల జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి బెయిల్ మంజూరైంది. రిమాండ్‌లో ఉన్న వీరిద్దరికి మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది.

బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌ -4గా రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో వీరిద్దరిని పోలీసులు గతంలో హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరిని అనంతపురానికి తరలించారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆర్టీఏ అధికారులు వారిపై అభియోగాలు మోపారు.