బజాజ్ చైర్మెన్ : తండ్రి స్థానంలో కొడుకు

బజాజ్‌ ఫైనాన్స్‌ చైర్మన్ మారనున్నారు. ఈ ‌ పదవి నుంచి రాహుల్‌ బజాజ్‌ వైదొలగనున్నారు. జులై 31న ఆయన వీడ్కోలు పలకనున్నారు. ఆయన కుమారుడు సంజీవ్‌ బజాజ్‌ చైర్మన్‌గా నియామకం కానున్నారు. 1987 నుంచి కంపెనీకి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న రాహుల్‌ బజాజ్‌ భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా 2020, జులై 31న తన పదవి నుంచి దిగిపోనున్నారు అని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.

రాహుల్‌ బజాజ్‌ చైర్మన్‌ పదవి నుంచి దిగిపోతున్నారని తెలియడంతో ఆ కంపెనీ షేర్ల ధర ఒక్కసారిగా 6.43% తగ్గిపోయింది. ఆయన స్థానంలో కుమారుడు, ప్రస్తుతం వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న సంజీవ్‌ బజాజ్‌ ఛైర్మన్‌గా ఎంపికవుతారని పేర్కొంది. బజాజ్‌ అలియాంజ్‌ జీవిత బీమా, బజాజ్‌ అలియాంజ్‌ సాధారణ బీమా కంపెనీకి సంజీవ్‌ 2013 నుంచే ఛైర్మన్‌గా కొనసాగుతుండటం గమనార్హం.