జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య ?

డిసెంబర్ 1న జీహెచ్ ఎంసీ ఎన్నికలపోలింగ్ జరగనుంది. 4న ఫలితాలు రానున్నాయ్. రేపే నామినేషన్లకి ఆఖరి గడువు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ ఎన్నికల్లో తెదేపా కూడా బరిలోకి దిగనుంది. మొత్తం 150 స్థానాల్లో కాకుండా కొన్ని స్థానాల్లోనే తెదేపా బరిలోకి దిగనుంది.

ఈ నేపథ్యంలో లోకేష్‌ తో సహా బాలకృష్ణను కూడా గ్రేటర్‌ ప్రచారంలోకి దింపాలని టీడీపీ ఆలోచిస్తుందట. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది నాయకులు బాలకృష్ణను కలిసి ప్రచారానికి రావాలని కోరారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు ఆగాల్సిందే.