కరోనాని జయించిన బాలు

ఇటీవల కాలంలో ఇంతకంటే గుడ్ న్యూస్ మరోటి వినలేదేమో. లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణం కరోనాపై గెలుపొందారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఎస్పీబీ కోలుకోవాలని కొన్ని రోజులుగా ప్రార్థిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈనెల 5న కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఆయన వెంటిలెటర్ పై ఉండటం ఆందోళన కలిగించింది. ప్రతిరోజూ విడుదల చేస్తున్న బులిటెన్ లోనూ బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని రావడంతో ఇంకా కంగారుపడిపోయారు. కానీ అందరి ప్రార్థనలు ఫలించి బాలు కరోనా నుంచి క్షేమంగా బయటపడ్డారు.