పీవీ, ఎన్టీఆర్’లపై కేసీఆర్ స్పందించకపోవడం ఏంటీ ?

పీవీ నరసింహారావు, ఎన్ టీఆర్.. ఈ ఇద్దరు అంటే సీఎం కేసీఆర్ కు మహా ఇష్టం. వీరిద్దరికి భారతరత్న ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వీరిద్దరి సమాధులు కూల్చాలని ఎంఐఎం నేత అక్భరుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై భాజాపా,కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడం విశేషం.దీనిపై భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

పీవీ, ఎన్టీఆర్‌లు తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తులని, అలాంటి వారి ఘాట్‌లను కూల్చాలని కొంతమంది సంఘవిద్రోహ శక్తులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్‌ల స్కూల్ నుంచి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.

Spread the love