బండి సంజయ్ తో పవన్ భేటీ వెనక

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ జనసేనతో కలిసి పని చేసే విషయంపై చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణ భాజాపా నేతలు మాత్రం అదేం లేదని చెబుతున్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.

రాజకీయంగా ఏపీ, తెలంగాణలో వేరు వేరు పరిస్థితులున్నాయి. పవన్ మొదటి నుంచి ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీ చేశారు. జనసేనకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కినా.. ఓట్ల శాతం బాగానే పడింది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు జనసేన భరిలోకి దిగలేదు. సూటిగా చెప్పాలంటే తెలంగాణలో భాజాపాకి జనసేన అవసరం పెద్దగా లేదు. మరీ.. పవన్-బండి సంజయ్ భేటీలో ఏం చర్చించినట్టు ? అంటే.. అది సీక్రెట్ అని చెబుతున్నారు.