బండి లక్ష్యం అదేనట !

తెలంగాణ భాజాపా దూకుడు కొనసాగిస్తోంది. సీఎం కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేయడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు జనగామ జిల్లాలో వివాదాస్పదమైంది. మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ముందు కాషాయ కార్యకర్తలు ధర్నాకు దిగడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో లాఠీచార్జ్‌ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై బండి సంజయ్ స్పందించారు. జనగామ మున్సిపల్ కమిషనర్, సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

వివేకానంద ఫ్లెక్సీలను కావాలనే తొలగించారని బండి సంజయ్ తప్పుబట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఐ, ఎస్సై చితకబాదారని, సీఎం డైరెక్షన్‌లో పోలీసులు రెచ్చిపోతున్నారని మందిపడ్డారు. వివేకానంద జయంతి జరిపితే సీఎంకు వచ్చిన ఇబ్బందేంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Spread the love