నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వెళ్లారు. అక్కడ కాలం కలిసి రాకపోవడంతో తిరిగి సినిమాలలోకి వచ్చాడు. త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్‌ని కొందరు నెటిజన్స్ రాజకీయాలలోకి లాగి రచ్చ చేస్తున్నారట.
ఈ విషయంపై ఆవేదన చెందిన బండ్ల తన ట్విట్టర్లో కామెంట్ పెట్టాడు. “నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్” అంటూ వారందరినీ రిక్వెస్ట్ చేశారు. మరీ.. ఇప్పటికైనా నెటిజన్స్ బండ్లని వదిలేస్తారా ? అన్నది చూడాలి.
Spread the love