మందు బాబులకి గుడ్ న్యూస్.. బార్లు తెరచుకోనున్నాయ్ !

కరోనా లాక్‌డౌన్ తో మందుబాబులకి చుక్కలు కనిపించిన సంగతి తెలిసిందే. మందు షాపులు బంద్ కావడంతో మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులకి మినహాయింపు లభించడంతో మందు బాబులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మందుని ఇంటికి తెచ్చుకొని తాగడం అంతా స్వేచ్ఛగా అనిపించడం లేదని మందుబాబులు అసంతృప్తితో ఉన్నారు. వారికి రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు ఇవ్వడంతో సోమవారం రోజున రాజస్థాన్‌ ప్రభుత్వం బార్లు తిరిగి తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. జూన్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ.. బార్లపై ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పటివరకు మూసేఉన్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్‌లు తెరుచుకోనున్నాయి.