బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య

తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ”ప్రకృతితో మమేకమై జరుపుకునే ‘బతుకమ్మ’ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు. మన జీవసృష్టికి ప్రకృతే మూలం. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమని నేను బలంగా విశ్వసిస్తాను. నవరాత్రుల్లో.. అమ్మవారిని ప్రకృతిశక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ బతుకమ్మ పండుగలో కులాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఓ చక్కటి సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ బతుకమ్మను జరుపుకోవాలని సూచిస్తున్నాను” అని వెంకయ్య ట్వీట్ చేశారు.

ఇక నిన్నటి తో మొదలైన బతుకమ్మ సంబరాలు ఈనెల 24వరకు కొనసాగనున్నాయి. ఒక్కోరోజు ఒక్కో రూపంలో బతుకమ్మని పేరుస్తారు. ప్రపంచంలోనే పూలకు పూజ చేసే సంస్కృతి తెలంగాణ ప్రజలది.