కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చండి : భట్టీ

తెలంగాణలో కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీ కిందికి తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంది. భాజాపా, తెదేపా, కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కరోనా బాధితులకు సరైన వైద్యం అందడం లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు ఆస్పత్రి నుంచి 50 పడకలు తీసుకుకొని ప్రభుత్వమే వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పేద మధ్య తరగతి ప్రజల కోసం కరోనాను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చాలని, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యం నింపాలని కోరారు.

Spread the love