బెల్ బాటమ్ షూటింగ్ పూర్తి

అక్షయ్ కుమార్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘బెల బాటమ్’. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. షూటింగ్ లకి అనుమతులు రాగానే.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా ‘బెల్ బాటమ్’ షూటింగ్ కంప్లీట్ అయింది.

ఈ విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ ట్విట్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా హీరోయిన్స్‌గా నటించారు. మరోవైపు అక్షయ్ కుమార్.. త్వరలో ‘పృథ్వీరాజ్’, ‘ఐతరంగీ రే’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు.