చైతు – రాశి లవ్ ట్రాక్ హైలైట్ ..

నాగ చైతన్య – వెంకటేష్ హీరోలుగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజపుత్ నటిస్తుండగా..చైతు కు జోడిగా రాశిఖన్నా నటిస్తుంది. కాగా నిన్న (నవంబర్ 30) న రాశి పుట్టిన రోజు సందర్బంగా వెంకీమామ చిత్ర యూనిట్ ప్రత్యేక వీడియో ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో రాశి పాత్ర తాలూకా సన్నివేశాలు చూపించారు.

ఈ టీజర్ బట్టి చూస్తే..పట్నంలో బాగా చదుకొని సొంతూరికి తిరిగొచ్చిన మోడరన్ పల్లెటూరి అమ్మాయిగా రాశి ఖన్నా పాత్ర ఉంటుందని అర్థం అవుతుంది. ఇక నాగ చైతన్య-రాశి ఖన్నా లమధ్య లవ్ ట్రాక్ సినిమాకే ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.

ఇందులో వెంకటేశ్‌, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, సంపత్‌ రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.