బెంగళూరులో భార్గవరామ్.. దొరికాడా ?

మొన్నటి వరకు ఓ రాష్ట్రానికి మంత్రి. ఇప్పుడు నిందితురాలు. ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఆమె ఎవరనేది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెని ఏ1 నిందితులిరాలిగా పేర్కొన్నారు. ఇక ఆమె భర్త భార్గవ్ రామ్ ని ఏ3 గా చేర్చారు. పరారీలో ఉన్న భార్గవరామ్‌ బెంగళూరులో ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు.

అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్‌ చేయించడం కోసం గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన 15 మందిని భార్గవరామ్‌ రప్పించాడని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కు పాల్పడిన దుండగులు టోల్‌ప్లాజాలవైపు వెళితే దొరికిపోతామన్న ఉద్దేశంతో అవి లేని సర్వీస్‌ రోడ్ల మీదుగా బెంగళూరు వైపు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌ కు పథకం రచించిన భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

Spread the love