బంటు ను ఫాలో అవుతున్న భీష్మ..

అల వైకుంఠపురం లో చిత్రంలో బంటు గా అల్లు అర్జున్ తన నటనతో చించేసిన సంగతి తెలిసిందే . కేవలం నటన మాత్రమే కాదు ఈ చిత్ర ప్రమోషన్ విషయంలో బన్నీ చాల తెలివిగా వ్యవహరించి సినిమా సక్సెస్ లో భాగమయ్యాడు. కేవలం టీజర్స్ , ట్రైలర్ మాత్రమే కాకుండా పాటలు కూడా అదే లెవల్లో విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే మాదిరిగా భీష్మ ప్లాన్ చేస్తుంది.

ఇప్పటికే మొదటి పాట ‘వాటే వాటే బ్యూటీ’తో మంచి బజ్ తెచ్చుకుని తాజాగా రెండవ పాట ‘సరాసరి గుండెల్లో దించావే’తో ఆకట్టుకుంటోంది. ఈ రెండు సాంగ్స్ ప్రేక్షకుల్లోకి బాగానే వెళ్లాయి. ఫలితంగా సినిమాకు పాజిటివ్ వాతావరణం కనబడుతోంది. ఆల్బమ్ లోని మిగతా పాటల్ని కూడా ఇలానే ఉండేలా చూసుకునే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ ఉన్నారు. మరి అల సక్సెస్ భీష్మ కు కలిసొస్తుందా అనేది చూడాలి.