బీహార్ అసెంబ్లీ ఎన్నికల రద్దుపై సుప్రీం మాట

ఈ యేడాదిలోనే బీహార్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలని రద్దు చేయాలని అవినాశ్ థాకూర్ దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీం స్పందించింది. కోవిడ్ నెపంతో ఎన్నిక‌ల‌ను ఆప‌లేమ‌ని, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అధికారాల‌ను ప్ర‌శ్నించ‌లేమ‌ని సుప్రీం పేర్కొన్న‌ది.

బీహార్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇంత వ‌ర‌కు నోటిఫికేష‌న్ కూడా రాలేద‌న్న‌విష‌యాన్ని పేర్కొంటూ సీఈసీకి తామేమీ ఆదేశాలు ఇవ్వ‌లేమ‌ని, క‌మిష‌న‌ర్ అన్నీ ప‌రిగ‌ణలోకి తీసుకుంటార‌ని కోర్టు చెప్పింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ కాలేద‌ని, అందుకే పిటిష‌న్‌కు అర్హ‌త లేద‌ని, ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌ద్దు అని ఈసీని ఎలా ఆదేశిస్తామ‌ని కోర్టు చెప్పింది.