కరోనాతో బీహార్ మంత్రి కన్నుమూత

కరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలయ్యారు. తాజాగా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బీహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ గురువారం అర్థరాత్రి కరోనాతో కన్నుమూశారు.

69 ఏళ్ల వయసున్న మంత్రి కపిల్ దియోకు ఇటీవల కరోనా సోకడంతో ఆయన పట్నాలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIMS) లో చేరి గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. కరోనాతోపాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మంత్రి కామత్ పరిస్థితి విషమించడంతో అర్దరాత్రి 1.30గంటలకు తుదిశ్వాస విడిచారు.