బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్ కామెంట్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసింది. గ్రేటర్ ప్రజలకి పలు హామీలు ఇచ్చింది. మెట్రో, సిటీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణం ప్రకటించింది. ఎల్ ఆర్ ఎస్ రద్దు చేస్తామని కూడా భాజాపా హామీ ఇచ్చింది. అయితే భాజాపా మేనిఫెస్టో పై మంత్రి కేటీఆర్ సటైర్స్ వేశారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టోని బిజెపి మక్కికీ మక్కి కాపీ చేసిందన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ గత ఆరు ఎళ్లుగా చేసిన లేదా చెప్పిన కార్యక్రమాలని బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది.. బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలతో పాటు ఫోటోలు కూడా మావే.. ‘ఫోటోలు మావి.. ఫోజులు మీవి..’ అన్నారు మంత్రి కేటీఆర్.

Spread the love