కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ (69) కరోనాతో మంగళవారం రాత్రి మరణించారు. బీహార్ రాష్ట్రంలో కరోనాతో మరణించిన మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా సునీల్ కుమార్ నిలిచారు.

దర్బంగా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ కు ఈ నెల 13వతేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని దర్బంగాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్న సునీల్ కుమార్ కు కరోనా సోకడంతో మంగళవారం రాత్రి మరణించారని కొవిడ్ నోడల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ చెప్పారు.