రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం బీజేపీ మాట

సీఆర్డీఏ, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకి గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిని భాజాపా స్వాగతించింది. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్‌ గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు.

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్‌ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.