బాలీవుడ్ డ్రగ్స్ కేసులో 25 మంది !

సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోనిక్ చక్రవర్తి అరెస్ట్ అయ్యారు.

ఇక విచారణలో రియా 25 మంది పేర్లని బయటపెట్టినట్టు సమాచారమ్. ఈ లిస్టులో ప్రముఖ హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్ట పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్‌సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లు, డ్రగ్స్‌ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్‌ ప్రముఖులందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.