ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా 30 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు లబ్దిపొందుతారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దసరా లోపు ఆ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని చెప్పారు.

ఈ బోనస్ కారణంగా ఖజానాపై రూ.3,737 కోట్ల భారం పడుతుందని అన్నారు. ప్రొడక్టివిటీ, నాన్-ప్రొడక్టివిటీ రూపంలో బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.