ఎమ్మెల్సీగా బొంతు ?

వచ్చే యేడాది ఫిబ్రవరిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై తెరాస ఫోకస్ పెట్టింది. సోమవారం దీనిపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును పరిశీలిస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్థిగా రామ్మోహన్‌ను నిలిపే ఆలోచనలో మంత్రి కేటీఆర్ ఉన్నట్టు సమాచారమ్. ప్రస్తుతం హైదరాబాద్ మేయర్‌గా ఉన్న రామ్మోహన్‌ను.. మండలికి పంపించాలని భావిస్తున్నారు. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డినే బరిలోకి దింపనున్నారు. త్వరలోనే తెరాస అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది.