బోటు ప్రమాదం.. 25మంది మృతి !

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బురిగంగ నదిలో రెండు బోట్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బోటు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్ఫోయారు. పలువురు గల్లంతయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100మంది ఉన్నారు. మృతిచెందిన వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 23మంది మృతదేహాలను గుర్తించామనీ.. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు బంగ్లా అధికారులు తెలిపారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.