బీజేపీలో చేరికపై బ్రహ్మీ మాట

టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రహ్మీ బీజేపీ తరుపున ప్రచారానికి దిగారు. ఈ నెల 5న కర్నాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్రహ్మానందం, చిక్క బళ్లాపుర నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు.

అక్కడి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి, తర్వాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్‌ సుధాకర్‌ తరపున బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే బ్రహ్మీ భాజాపాలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై బ్రహ్మీ మాట్లాడుతూ.. సుధాకర్‌ తనకు మిత్రుడని, అందుకే ఆయన గెలుపుకోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ముందు ఇలాగే చెప్పి తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లని చూశాం. ఇప్పుడు బ్రహ్మీ కూడా అంతేనని చెప్పుకొంటున్నారు.