చెన్నైకి షాక్.. బ్రావో అవుట్ !

ఊహించినదే జరిగింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. కీలక ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి తప్పుకున్నాడు. గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న బ్రావో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఈ మేరకు చెన్నై జట్టు సీఈవో విశ్వనాథన్ ఓ ప్రకటన చేశారు.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఎంతో ఉపయుక్తంగా ఉండే బ్రావో గైర్హాజరీ ధోనీ సేనకు తీరనిలోటు. తాజా ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన చెన్నై 7 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇక లేనట్టే! ఇక మిగిలిన మ్యాచ్ లలో యువ ఆటగాళ్లకి చెన్నై జట్టు అవకాశం ఇవ్వనుంది.