హైదరాబాద్ మెట్రో సేవలకి బ్రేక్.. ఎందుకంటే ?

హైదరాబాద్ మెట్రో సేవలు ఆగిపోయాయ్. గంటసేపటి క్రితం ఎల్బీనగర్- మియాపూర్ రూట్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు హెచ్ఎంఆర్ఎల్ టెక్నికల్ బృందం పనిచేస్తుంది.

లాక్ డౌన్ సడలింపుల తర్వాత పున ప్రారంభం అయిన హైదరాబాద్ మెట్రోకు పెద్దగా ఆదరణ లేదు. ఓవైపు ఆఫర్లు ప్రకటిస్తూ మెట్రో సంస్థ సర్వీసులు కొనసాగిస్తుంది. లాక్‌డౌన్‌ అనంతరం సెప్టెంబరు 7 నుంచి రైళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా మార్గదర్శకాలతో మెట్రో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.