ఆన్ లైన్ లో ఆస్తుల నమోదుకు బ్రేక్

హైదరాబాద్ లో ఆన్ లైన్ లో ఆస్తుల నమోదు ప్రక్రియకి బ్రేక్ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లోని పలు కాలనీలో నీట మునిగిన సంగతి తెలిసిందే. వర్షాలు, వరదలు తగ్గినా చాలా ప్రాంతాలు బురదమాత్రం అలాగే ఉంది.

ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తుల ఆన్‌లైన్‌ సర్వేను తాత్కాలికంగా నిలిపివేశారు. జీహెచ్ఎంసీలో అధికారులు వరదల సహాయక చర్యల్లో నిమగ్నం కావడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆస్తుల ఆన్‌లైన్ ప్రారంభించనున్నారు. కాగా, దసరాకి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ఆ లోపే ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని అధికారులు భావించారు