సచివాలయం కూల్చివేత.. ప్రభుత్వానికి నోటీసులు !

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయ్. అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయ్. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులు తీసుకుస్తున్నారు. తాజాగా సచివాలయం కూల్చివేతపై కాసేపట్లో హైకోర్టు నోటీసులు.. సీఎస్‌కు అందుతాయని.. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తెలిపారు.

పాత భవనాలను మాత్రమే కూల్చటానికి హైకోర్టు అంగీకరించిందన్నారు. సచివాలయంలోని నూతన భవనాలను సైతం కూల్చాలనుకోవటం హైకోర్టు ధిక్కరణేనన్నారు. సచివాలయాన్ని కాపాడుకోవటానికి సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. సోమవారం హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తోందన్న నమ్మకం ఉందని విశ్వేశ్వరరావు తెలిపారు.

Spread the love