కేంద్ర ఆర్థికమంత్రిని కలిసిన బుగ్గన

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్‌ అంశాలతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు.

భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పన్ను వసూళ్లలో గత 3 నెలల్లో 40శాతం లోటు ఏర్పడింది. జీఎస్టీ బకాయిలు రూ. 3,000 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలతో పాటు.. అదనంగా నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాము అన్నారు బుగ్గన.

Spread the love