మళ్లీ బన్నీదే రికార్డు అంటున్నారు…

నా పేరు సూర్య తర్వాత చాల గ్యాప్ తీసుకొని అల వైకుంఠపురం లో చిత్రం చేసాడు బన్నీ. త్రివిక్రమ్ డైరెక్షన్లో థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ పెద్ద హిట్ అయినా చిత్రం గా ఇండస్ట్రీ రికార్డ్స్ లలో నిలిచిపోయింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో బన్నీ తన 20 వ చిత్రం చేస్తున్నాడు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ రోల్ లో .. మాస్ అండ్ డీగ్లామర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తికాగా సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఈ ఏడాది దసరా బరిలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని..చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఇక ఈ మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా..దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.