కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం అయింది. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత జరిగిన తొలి కేబినేట్ సమావేశం ఇది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది.
కేంద్ర కేబినేట్ నిర్ణయాలని కేంద్రమంత్రి జవదేకర్‌ మీడియాకి తెలియజేశారు.

లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని ఆయన అన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయని, భారత్‌లో కరోనా కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రజలంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు.