నిర్మాతపై కేసు పెట్టిన నటుడు

బాలీవుడ్ లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ పథక్ కేసు పెట్టాడు. ఏక్తా కపూర్ నిర్మించిన అన్ సెన్సార్డ్ సీసన్ -2 వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాలపై ఫిర్యాదు చేశారు.

అన్ సెన్సార్డ్ సీసన్ -2 లోని ‘ప్యార్ ఔర్ ప్లాస్టిక్’ అనే ఎపిసోడ్ లో ఒక వ్యక్తికి ఆర్మీ దుస్తులు వేసి అతనితో అభ్యంతర కరమైన సంభాషణలు పలికించారని ఈ కేస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసు ని ఆగస్టు 24న విచారణ చేపట్టనుంది. మరీ.. ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.