కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతిపై కేసు నమోదు

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కీసర తహసీల్దార్ చంచల్‌గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్‌ కేసుగా నమోదు చేశారు డబీర్‌పురా పోలీసులు. రెండు నెలలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నాగారాజు మృతిచెందడంతో.. 176 సీఆర్పీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తహిశీల్దార్ మృతికి సంబంధించి జైలు అధికారుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేయనున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు నాగరాజు ప్రవర్తనపై మిగతా ఖైదీల నుండి వివరాలు సేకరించిన పోలీసులు.. ఇప్పటికే నాగరాజు నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు.. ఫోరెన్సిక్ నివేదిక రాగానే హైదరాబాద్ కలెక్టర్‌తో పాటు ఎన్‌హెచ్‌ఆర్సీకి కస్టోడియల్ డెత్‌పై నివేదిక అందించనున్నారు అధికారులు.