వర్మపై కేసుపెట్టిన కేఏ పాల్ కోడలు

వివాదాస్పద దర్శకుడు కేఏ పాల్ పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రం ‘అమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా కోసం కేపాల్ వర్మకు సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐతే, ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్ అయిపోతుంది. అయితే దీనిపై స్పందించిన కే ఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీస్ స్టేషన్ లో వర్మ పై కేసు నమోదు చేసింది.

గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు తాము దిగిన ఫోటోలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని.. రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలి అంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది జ్యోతి . జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐసీసీ 469 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా.. తాజాగా వర్మ మరో మార్పింగ్ ఫోటోని షేర్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ, ఎంపీ విజయసాయిరెడ్డి లు తన సినిమా విడుదల తేదీని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న తో ఫోటోలని షేర్ చేశాడు.