సోనియా గాంధీపై కేసు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదైంది. పీఎం కేర్స్ ఫండ్‌పై మే 11వ తేదీన.. కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. సోనియా గాంధీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ కామెంట్ల వచ్చినట్లు తేలింది. దీంతో సోనియాపై కర్నాటకలోని శివమొగ్గలో కేసు నమోదు చేశారు. అడ్వకేటు ప్రవీణ్ కేవీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్‌ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలో రాజకీయాలకి తావులేకుండాపోయాయ్. ఫోకస్ అంతా కరోనాపైనే నెలకొంది. అయితే కరోనా పట్ల, దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టే విషయంలో మోడీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కూడా హస్తం పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.