రాష్ట్రాలపై కేంద్రం సీరియస్


కరోనా లాక్‌డౌన్ సడలింపుల విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలకి కేంద్రం ప్రాధాన్యతని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధలని పాటిస్తూ.. అదనంగా సడలింపులు ఇచ్చుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే నాల్గో విడత లాక్‌డౌన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సడలింపులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశంలో రోజురోజూకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలలో అమలు చేస్తున్నసడలింపులపై కేంద్రం సీరియస్ అయింది. కేంద్రం లాక్‌డౌన్‌ అమలులో వివిధ రాష్ట్రాల్లో లోపాలు తలెత్తుతున్నాయని కేంద్ర హోం మంత్రిత్మ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలకు హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. కంటైన్మెంట్ జోన్లలో మార్గదర్శకాలను ఎక్కువగా ఉల్లంఘించినట్లు తమకు సమాచారం వచ్చిందని లేఖలో ప్రస్తావించారు.