తెలంగాణపై కేంద్రం అసంతృప్తి

యాక్షన్ టు రియాక్షన్ అంటారు కాదా. ఇప్పుడు కేంద్రం, తెలంగాణ రాష్ట్రం విషయంలో అదే జరుగుతోంది. కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సీఎం కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్యాకేజీ అంతా డొల్ల అన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కరోనా కట్టడిలో, కరోనా సాయంలో తెలంగాణ భేష్ అన్న కేంద్రం గొంతు మారింది. పైగా తెలంగాణలో కరోనా టెస్టుల విషయంలో కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

తెలంగాణలో 21 వేల కరోనా పరీక్షలు మాత్రమే చేశారని కేంద్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు లోబడే టెస్టులు చేస్తున్నామని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో 21 వేల కరోనా పరీక్షలు మాత్రమే చేశారని కేంద్ర అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని ఈటల తప్పుబట్టారు.