వదినతో కలిసి ఓపెనింగ్ నా ?

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 మెగా టోర్నీ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. గతంలో, తాజాగా చేస్తున్న ఫిట్నెస్ వీడియోని షేర్ చేస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ.. భార్యతో కలిసి చేసిన వర్కవుట్ వీడియోని షేర్ చేసారు.

రోహిత్ శర్మ తన భార్యతో కలిసి చేసిన వ్యాయమాల సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోహిత్,రితికా ఒక్కరినోక్కరిని అనుసరిస్తూ వర్కౌట్స్ చేస్తున్నారు. ఆ వీడియోకు స్పిన్నర్ చాహల్‌ కూడా సరాదగా కామెంట్ చేశాడు. ‘ఐపీఎల్‌లో ఈఃసారి ఓపెనర్‌గా వదినతో కలిసి బరిలో దిగుతున్నావా?’ అంటూ ఛలోక్తి విసిరాడు.