ఏపీ సీఎంవోలో కీలక మార్పులు

ఏపీ సీఎం జగన్ లక్ష్యాలను అధిగమించడానికి నిర్ణయాల విషయంలో సీఎం జగన్‌ దూకుడుగా ఉన్నారు. అయితే, పరిపాలన విభాగంలో కొద్ది మంది దూకుడుగా పనిచేయలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సచివాలయంలో, సీఎం కార్యాలయంలో జగన్‌ స్పీడ్‌ను అందుకునే అధికారులు లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంవోలో కీలక మార్పులు జరుగబోతున్నట్టు సమాచారమ్.

సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా సీసీఎల్ఏ నీరబ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నీరబ్‌ కుమార్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదిత్యనాథ్‌కు సీసీఎల్‌ఏ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంతో పరిపాలన పరంగా మరింత వెసులుబాటు.. జవాబుదారీ తనం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.