‘‘చావు కబురు చల్లగా’ మూవీ ఓపెనింగ్..

ఆర్ఎక్స్ 100 , హిప్పీ , గుణ 369, 90 ఎంఎల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో కార్తికేయ..తాజాగా చావు కబురు చల్లగా అనే సినిమాను ప్రారంభించారు. ఈరోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్బంగా ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలను హైదరాబాద్ లో పూర్తి చేసారు. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. సినిమా ఓపెనింగ్ సందర్బంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు.ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన కాస్ట్ & క్రూ వివరాలు తెలియాల్సి ఉంది.