చిదానంద మూర్తి ఇకలేరు

ప్రముఖ పండితుడు, పరిశోధకుడు, రచయిత డాక్టర్ చిదానంద మూర్తి (88) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిదానంద శనివారం తెల్లవారుజామున బెంగళూరులో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.
వ్యతిరేకతతో సంబంధం లేకుండా సైద్ధాంతిక వైఖరికి పేరుగాంచిన ఎన్నో రచనలు చేశారు చిదానంద మూర్తి.

కర్ణాటక కన్నడ భాష, సంస్కృతి, భూమి మరియు కర్ణాటక చరిత్రపై తన పరిశోధనలు చేసి చరిత్రకారుడుగా నిలిచారు. హంపి విజయనాగర సామ్రాజ్యం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు చిదానంద మూర్తి. చిదానంత మృతిపట్ల కర్ణాటక సీఎం యాడ్యూరప్ప సంతాపం తెలిపారు. హంపీ కట్టడం పరిరక్షణలో ఆయన పాత్ర, కన్నడ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు రావడానికి చేసిన కృషి బహుదా ప్రశంసనీయమని ఆయన గుర్తుచేసుకున్నారు.