వైరల్ : చిరంజీవి సర్జా ఆఖరి పోస్ట్

శాండల్‌వుడ్‌ స్టార్ చిరంజీవి సర్జా సడెన్ డెత్ కలచివేస్తోంది. అయితే సర్జా చనిపోవడానికి కొద్దిసేపటి ముందు స్నేహితుడితో ఛాట్ చేశాడు. తన ప్రాణ స్నేహితుడు ప్రజ్వల్‌ దేవరాజ్‌తో ట్విట్టర్‌ వేదికగా జరిపిన చాట్‌కి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన ఈ సంభాషణలో రేపు ఏం జరుగుతుందో తెలియదు.. ఫ్రెండ్స్‌తో కలిసి వారం టూర్‌ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను అని రాసాడు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

39 ఏళ్ళ వయస్సులో చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. 2018లో మేఘనా రాజ్‌ని చిరంజీవి సర్జా వివాహం చేసుకోగా, ఆమె ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తుంది. కాగా, చిరంజీవి సర్జా ..హీరో అర్జున్‌కి బంధువు అనే విషయం తెలిసిందే.