సీఎం కేసీఆర్ ని కలిసిన చిరు, నాగ్

అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి-విస్తరణపై చర్చ జరిగింది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ఫిల్మ్‌ సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందు కోసం ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి, ఇస్తుంది.

అందులో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో షూటింగ్‌లు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు.