డ్రగ్స్ కు వ్యతిరేకంగా రెహమాన్, చిరంజీవి ప్రచారం

అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, మెగాస్తార్ చిరంజీవి. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా కోరారు రెహమాన్. ఇక ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి వెబ్ నార్ ద్వారా పాల్గొన్నారు.

యాంటీ డ్రగ్‌ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్‌, ఇతర అధికారులు, వెబినార్‌ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిషి జన్మ. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం. మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా? దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంది’ అన్నారు చిరు.