చిత్రం సీక్వెల్ వస్తోంది

తేజ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘చిత్రం’. ఉదయ్ కిరణ్-రీమా సేన్ జంటగా నటించారు. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత జయం, నిజం సినిమాలతో దర్శకుడిగా నిలదొక్కుకున్నారు తేజ. అయితే చిత్రం సినిమా వచ్చి 20యేళ్ల తర్వాత దానికి సీక్వెల్ చేయబొతున్నారు. ఇప్పుడీ ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. ‘చిత్రం 1.1’ పేరుతో దీనిని నిర్మిస్తున్నట్టు పేర్కొంటూ, దర్శకుడు తేజ ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

తేజ చిత్ర నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్, ఎన్ స్టూడియోస్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ‘చిత్రం’లోలానే ఇందులో కూడా కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగును నిర్వహిస్తారు. దీనికి కూడా ఆర్ఫీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.

Spread the love