సీటీమార్ షూటింగ్ అప్ డేటు

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో షూటింగులకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాలు షూటింగ్స్ కి రెడీ అవుతున్నాయి. షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. దర్శకుడు సంపత్ నంది సారథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మిస్తున్న సినిమా సీటీమార్.

ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌ మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు.