కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్

విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. ఇవాళ మూలానక్షత్రం సందర్భంగా సీఎం జగన్ ఇంద్రీకీలాద్రికి తరలివెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా సమర్పించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టు, తలపాగా ధరించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సీఎం వెంట మంత్రి కొడాలి నాని, శాసనసభ్యులు వల్లభనేని వంశీ, పార్థసారథి కూడా ఉన్నారు. సీఎం జగన్ తన పర్యటన సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.