నాగ్ ని విష్ చేసిన సీఎం జగన్

మన్మథుడు నాగార్జున 61వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. సీఎం జగన్ కూడా నాగ్ ని విష్ చేశారు. తెలుగు సినీ రంగంలో అత్యంత ప్రేక్షకాభిమానం పొందుతున్న హీరోల్లో ఒకరని నాగ్ ను కొనియాడారు. భగవంతుడు నాగార్జునకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇక పుట్టినరోజు సందర్భంగా తనని విష్ చేసిన వారికి నాగ్ థ్యాంక్స్ చెప్పారు. అదే సమయంలో  ఐదున్నర నెలల తర్వాత మళ్లీ వర్క్ చేయబోతున్నానని వెల్లడించారు. ‘బిగ్ బాస్ సీజన్-4 షూటింగ్ లో పాల్గొనబోతున్నాను. గతేడాది బిగ్ బాస్-3తో మీ ముందుకు వచ్చాను. ఆ సీజన్ లో నన్ను ఎంతగానో ఆదరించి, ఆ షోను సక్సెస్ చేశారు. అందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు సీజన్-4ని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నానని నాగ్ అన్నారు.