పృధ్వీపై సీఎం జగన్ ఫైర్

నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ కి సంబంధించిన ఓ ఆడియో టేపు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్వీబీసీ ఛానెల్ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగితో పృధ్వీ అసభ్యకరంగా మాట్లాడారు. ఇప్పుడీ ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి తప్ప, కులాల ప్రస్తావన ఎందుకని సీఎం మందలించినట్టు తెలుస్తోంది. రైతులపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం.

అంతేకాదు.. పార్టీ నేతలకి సీఎం జగన్ వార్నింగ్ ఇచారట. మొన్న రైతులు, ఇవాళ ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో అసభ్యకర మాటలు.. ఈ నేపథ్యంలో పృధ్వీపై వేటుపడనుందని వైకాపా నేతలు చెప్పుకొంటున్నారు. ఇప్పటికిప్పుడే కాకపోయినా.. ఓ నెల సమయం తీసుకున్నా.. పృధ్వీకి చెక్ పెట్టడం ఖాయం అంటున్నారు.